కొడంగల్, తెలంగాణ (కబుర్లు టుడే) నవంబర్ 08
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ నివాసంలో ముఖ్యమంత్రిని పలువురు నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ నివాసంలో పలువురు నాయకులు ముఖ్యమంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా, వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులు, అధికారులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






