కబుర్లు టుడే (కబుర్లు టుడే) జూన్ 23
ఏపీ ప్రభుత్వం 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా వెలగపూడి సచివాలయంలో మంత్రులతో జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సగటున రూ.3 కోట్ల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.







