అమృత్ 2.0 పథకం కింద సుమారు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బొక్కలగూడెంలో గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి భూమిపూజ చేశారు.
చెన్నూర్ ఆధునికీకరణ, 2027 పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: మంత్రి వివేకానంద చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.
చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027 లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.

