సంగారెడ్డి, 2026-07-28
కొండాపూర్ మండల పరిధిలోని తెర్పొల్ ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం హానర్ కంపెనీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కొండాపూర్ మండల పరిధిలోని తెర్పొల్ ప్రభుత్వ బాలికల పాఠశాల, బాలుర పాఠశాల, ఉన్నత పాఠశాలలో మంగళవారం హానర్ కంపెనీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కంపెనీ జీఎం, హెచ్ఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సతీష్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






