సంగారెడ్డి, 2026-07-30
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి సూచించారు. వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున వాగులు, వంకలు, బ్రిడ్జిలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి సూచించారు.భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, బ్రిడ్జిలపై వరద నీరు పొంగిపొర్లే అవకాశమున్నందున, నీరు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని ఆమె హెచ్చరించారు.అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని,అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా కొండాపూర్ పోలీస్ స్టేషన్ 8712656748 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్ఐ సోమేశ్వరి కోరారు.

