సంగారెడ్డి, శనివారం
ొడడవెజటెడధ,ౌఏఈజవచటట.ొటబచ,వవవధృవచ.
కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో శనివారం గెజిటెడ్ అధికారి అశోక్, హౌసింగ్ ఏఈ రాజేశ్వరి తో కలసి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. నివాసానికి సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి, వారి వివరాలను స్వయంగా ధృవీకరించారు.అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులకు పంపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.







