ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.
ప్రయాణికుల క్షేమం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అనుమానాస్పద ప్రాంతాలను, హోటళ్లను, ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా, ప్రయాణికులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ కోరారు.
ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, బస్సు వెక్కి క్రమంలో వాటిని పోగొట్టుకోకుండా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పోలీస్ అధికారుల బృందం పాల్గొంది.

