సంగారెడ్డి, 2026-07-24
మల్కాపూర్ గ్రామ సమీపంలోని తుంగమడుగు వాగులో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాన్ని కొండాపూర్ పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న డయల్-100 ద్వారా అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతుడిని సదాశివపేట వాసి పెద్దాపురం నర్సింలుగా గుర్తించారు.
మండలంలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో తుంగమడుగు వాగులో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి డయల్-100 ద్వారా సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
క్లూస్ టీమ్ సమక్షంలో పంచనామా నిర్వహించిన అనంతరం, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో మృతుడు సదాశివపేటకు చెందిన పెద్దాపురం నర్సింలు (తండ్రి: బాలయ్య)గా గుర్తించినట్లు కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.






