మామడ (కబుర్లు టుడే) సెప్టెంబర్ 05
మామడ మండలంలోని కమల్ కోట ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అలివేలు మంగతాయారు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమె 2002 నుంచి ఎస్జీటిగా సేవలందిస్తున్నారు.
అలివేలు మంగతాయారునకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము బైంసా మనోరంజని తెలుగు టైమ్స్ మామడ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల, కమల్ కోటలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలుగా పనిచేయుచున్న అలివేలు మంగతాయారుజిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక అయ్యారు. మంగతాయారు 2002 నుంచి ఎస్జీటిగా పనిచేయుచున్నారు.కౌటాల మండలం బాలెపల్లి నుంచి ఆమె ఉపాధ్యాయ సేవలు మొదలైనాయి.ప్రా.పా.అంకోలి,బీర్సాయి పేట, టాక్లీలో పనిచేసింది.ప్రస్తుతం కమల్ కోటలో పనిచేస్తూ న్నారు.ఎక్కడ పనిచేసినను విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే ఆమెతపన కనబడెవారు విద్యార్థులకు తగు తర్ఫీదును ఇచ్చి బోధించి,గురుకుల పాఠశాలలో ఎంపిక అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నారు.గతంలో పలువురు ఈ పాఠశాల నుంచి గురుకులానికి ఎంపిక అయ్యారు.ఈ ఉపాధ్యాయురాలికి అవార్డు వచ్చినందుకు గ్రామస్థులు,తోటి ఉపాధ్యాయ సిబ్బంది,ప్రధానోపాధ్యాయులు శ్రీ మన్మథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.







