సంగారెడ్డి, శనివారం
నెగగశనేగ(ఎఐఆర్ప్రక్రియపూర్తి..ఆ)గద.భగగగ715ఎనేషనఫీేగ,632ఫనైేశ.అధగనన.
కొండాపూర్ మండలంలోని చెర్ల గోపులారం గ్రామంలో శనివారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామంలో మొత్తం 715 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, వాటిలో 632 ఫారాలను డిజిటలైజ్ చేశారు. ఈ క్రమంలో 31 మరణించిన వారి, 13 షిఫ్టెడ్ అయిన వారి, 15 డబుల్ ఎంట్రీలుగా నమోదైన, 23 ఇతర గ్రామాలకు చెందిన ఫారాలను గుర్తించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఉప సర్పంచ్ పుణ్యమ్మ, వార్డు సభ్యులు చందు, నవీన్, పంచాయతీ కార్యదర్శి ప్రమీల, బీఎల్ఓ అనసూయ తదితరులు పాల్గొన్నారు.







