సంగారెడ్డి, 2026-07-25
కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ శనివారం ఘనంగా జరిగింది. పోచమ్మ, దుర్గాదేవి, ఎల్లమ్మ, మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
కొండాపూర్ మండలం లోని అనంతసాగర్ గ్రామంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం పోచమ్మ, దుర్గాదేవి, ఎల్లమ్మ, మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, శివ సత్తుల విన్యాసాల నడుమ మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలి వెళ్లి, నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

