కడప, జూన్ 15
నేర ప్రవృత్తిని మానుకోని రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
నేర ప్రవృత్తిని మానుకోని రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని, దాడులు ఉధృతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. భూ వివాదాలు, ఆర్థికపరమైన అంశాల వలన నమోదైన క్రిమినల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో విచారణను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని ఎస్పీ సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా, బహిరంగ మద్యపానం చేసేవారిపై డ్రోన్ కెమెరాల ద్వారా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
'శక్తి' టీంల ద్వారా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాలలో తప్పనిసరిగా బీట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో 'మహిళా భద్రత'పై, సోషల్ మీడియా ద్వారా మహిళలు, బాలికల వేధింపులపై అవగాహన కల్పించాలని సూచించారు.
దొంగతనాలకు పాల్పడిన వారి కదలికలపై నిఘా ఉంచాలని, వివిధ ప్రాంతాలలో జరిగే దొంగతనాలను మ్యాపింగ్ చేసి, ఆయా ప్రాంతాలలో గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే, షాపులు, లాడ్జిలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకుని, వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.




