కర్నూలు, జూన్ 24
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని మూడో పట్టణ సీఐ శేషయ్య పిలుపునిచ్చారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, నార్కో టెర్రరిజం ముప్పుపై ఆయన అవగాహన కల్పించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని మూడో పట్టణ సీఐ శేషయ్య పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు, నార్కో టెర్రరిజం ముప్పుపై అవగాహన కల్పించారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్డిపిఎస్ యాక్ట్ -1985, ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లు, డ్రగ్స్ సమాచారానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 వినియోగంపై వివరించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ డాక్టర్ అక్తార్ భాను, ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎలిషా, కానిస్టేబుల్ మాసూమ్ వలి, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ కోఆర్డినేటర్ శివ శంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.





